Listen "మా పల్లెటూరోళ్ల, గత కాలపు వినోదాలు!"
Episode Synopsis
నేను చాల రోజుల నుండి మన మధ్య నుండి మాయమై పోయిన ఒకప్పటి వినోదాల గురుంచి రాయాలనుకుంటున్న. కాక పోతే గత పల్లెవాసిగా నావన్నీ ఒకప్పటి గ్రామాల్లో కనిపించి ఇప్పుడు మాయమయ్యినవి అయ్యుంటాయి. మొదట మనందరికీ ఇష్టమైన ఆసక్తికర మైన రికార్డింగ్ డాన్స్ లతో మొదలెడుతా. మా వూరిలో శ్రీరామనవమి నాలుగు రోజులో ఐదు రోజులో జరిగేది. ఒక్కో రోజు ఒక్కొక్కరి ఉభయం. ఒక రోజు బలిజ వాళ్ళది , ఒక రోజు గొల్ల వాళ్ళది , ఒక రోజు సాలె వాళ్ళది , కళ్యాణం రెడ్లది ఇలా అన్న మాట. ఉభయం ఎవరిదైతే ఆ రోజు దేవుడి అలంకరణ , అన్న ప్రసాదాలు , వినోదాల ఏర్పాట్లు వాళ్లవే. మా వూరు అంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ వూరు. అమ్మమ్మ వూరు అంటే ఆత్మ బంధువుల వూరు అంటారుగా. ఈ ఉభయాల సందర్భం గా జరిగే వినోద సమర్పణలో మేము ఎదురు చూసేది రికార్డింగ్ డాన్స్, కీలు గుర్రాలు, నెమలి వేషాలు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రము ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం, ఈ లోపల డాన్స్ పాపలు వచ్చారా అని ఎంక్వయిరీ లు చేయటం, కుతూహలం చంపుకోలేక జట్లు జట్లు గ పిల్ల కాయలం వెళ్లి వాళ్ళు బస చేసిన ఇంటి చుట్టూ గిరికీలు కొట్టటం . ఈ లోపల ఎవడో పిల్లకాయ చెప్తాడు, నేను చుశానురా డాన్స్ పాపని కిటికీ తొర్రలోంచి అని. వాడు కన్ఫర్మ్ చేయగానే హమ్మయ్య అని తృప్తి పడటం.
చీకటి పడగానే మొదలయ్యేది వాళ్ళ ఊరేగింపు, బస దగ్గర నుండి గుడికి. కీలు గుర్రాలు , నెమలి వేషాల వాళ్ళు, రికార్డిండ్ డాన్స్ ట్రూప్ లు, దారి పొడవునా వాళ్ళతో పెట్రోమాక్ లైట్స్ వెలుగులో మేము. మొదట కీలు గుర్రాల ఆట, తర్వాత నెమలి వేషాలు, ఆ తర్వాత అసలు సిసలు రికార్డింగ్ డాన్స్ లు. ఈ రికార్డింగ్ డాన్స్ లకు నార్మల్ గా స్టేజి, ట్రాక్టర్ తొట్టి. మొదట డాన్స్ లన్నీ క్లాసికల్ పాటలకి. కుర్రాళ్ళు మాత్రం అసహనంతో ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉండేవారు. తర్వాత ఏమి జరగబోతుందో తెలిసినట్టు కొందరు ఊరు పెద్దలు మర్యాదగా తప్పుకొనే వారు. అప్పుడు మొదలయ్యేవి నా సామీ రంగా! పుట్టింటోడు తరిమేశాడు డాన్స్ లు. వాళ్ళు రెచ్చిపోవటం కుర్రకారు రెచ్చిపోవటం. డాన్స్ వేసే ట్రూప్ లో మొగ వాళ్ళని నెట్టేసి మా ఉరి మొగ జనాలే, ఆ డాన్స్ పాపలతో డాన్స్ లు. మిగతా రోజుల్లో ఉండేవి హరి కథ కాలక్షేపాలు, బుర్ర కథ లు. కానీ మాకు అవి ఎక్కవే. మాది అంత డాన్స్ పాపల పార్టీ అయ్యే.
ఇక కళ్యాణం అయినా మరునాడు వసంతోత్సవాలు, మాకు గుర్తుండే రోజు. ఊరు ఊరంతా వసంతాలు (హోళీ లాగ) పోసుకొనే వాళ్ళు. వరసైన వాళ్ళుంటే, కుర్ర కారుకి ఆ మజానే వేరు. ఇక మాకు పిల్లల కి పంటలు వచ్చే కాలం లో వచ్చే వినోదాలు చాలా వున్నాయి. ఎలుగు బంటిని తీసుకొని ఊరూరా తిరుగుతూ, వాటితో విన్యాసాలు చేయిస్తూ వచ్చే వారు కొందరు. కొందరు కాటి పాపలు అంటూ వచ్చేవారు, చిన్న చిన్న మేజిక్ ట్రిక్స్ చేస్తూ, వాళ్ళ చేతుల్లో గోలీలను మాయం చేసి మా ముక్కుల్లోంచి తీస్తూ బాగా వినోదం పంచేవారు. వాళ్ళ వెంట వీధులన్నీ తిరుగుతూ మేము. తర్వాత ఏమాల స్వాములని వచ్చేవారు గుర్రమెక్కి. సాయంత్ర మైతే పసుపు బట్టలతో తయారయ్యి స్వామిలా గుర్రమెక్కి ఊరి వీధుల్లో వూరేగేవారు. వాళ్లకి హారతులు ఇస్తూ ఇళ్ల ముందు, వాళ్ళ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ధాన్యం ఇచ్చేవారు ఊరి జనాలు. అలాగే హరి దాసులు. వీళ్ళు చూసేదానికి చాలా చక్కని వారు. మెడలొ హారాలతో నెత్తి మీద బంగారు రంగు పాత్రతో, హరిలో రంగ హరి అంటూ వీధి వీధికీ తిరుగుతూ వీళ్ళ వెంట మేము. అలాగే శంఖం ఊదుతూ వెట్టి వాళ్ళు వచ్చే వారు. అంత బార్టర్ సిస్టమే. ఇచ్చేది డబ్బులు కాదు, ధాన్యమే.
వరినాట్లుకి వరికోతలకు ఉత్తరాది వారు అంటూ పనికి వచ్చి అవి అయ్యేవరకు మా గ్రామము లోనే బస చేసే వారు. వాళ్ళని డబ్బుల కూలీలు అనే వాళ్ళం. మాకు విశాలమైన కొట్టాలు ఉండటం తో ఎక్కువమంది మా కొట్టాలలో వుండే వారు. వాళ్ళ భాషలు, వాళ్ళ వంటకాలు, వాళ్ళ పాటలు ,మా పిల్లలకి ఎప్పుడు వింత, ఎప్పుడు మహా ఆసక్తి. పంటలు కోసేసాక పొలాల్లో రాలిపోయిన గింజల్ని మేపుకోవడానికి బాతుల వాళ్ళు వచ్చే వారు. వాళ్ళ నివాసాలు పొలాల్లోనే. వాటి వెంట పడి ఆడటం మాకు సరదా.
అలాగే మా చుట్టూ పక్కల ఊర్లకంతా మా ఊరికి ఒక నాలుగైదు మైళ్ళ దూరం గొట్లపాళెం లో గౌతమి టాకీస్ అనే టూరింగ్ టాకీస్. సినిమాకి ఎద్దుల బండి కట్టించుకొని వెళ్ళటం లో హాయి అనుభవిస్తే కానీ అర్థం కాదు. దగ్గర దగ్గర కెళ్ళి నప్పుడు ఇంకా నమో వెంకటేశా! నమో తిరుమలేశా! అనే పాట ఇంకా వస్తుంటే ఆట ఇంకా మొదలు కానట్టు. లవకుశలు, పాండవ వనవాసాలు, నర్తన శాలలు, మాయా బజారులు వThis podcast uses the following third-party services for analysis: Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
More episodes of the podcast Harshaneeyam
'నువ్వు లేని అద్దం' నవల మీద మెహెర్!
16/08/2025
"Translating 'Heart Lamp' : Deepa Bhasthi"
30/07/2025
Sophie Hughes on 'Perfection'
28/06/2025
ZARZA We are Zarza, the prestigious firm behind major projects in information technology.