పచ్చకామెర్లపై గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల చర్చ: హెచ్చరిక సంకేతాలు, ప్రమాద కారకాలు మరియు నివారణ చిట్కాలు

01/08/2025 25 min Temporada 1 Episodio 85
పచ్చకామెర్లపై గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల చర్చ: హెచ్చరిక సంకేతాలు, ప్రమాద కారకాలు మరియు నివారణ చిట్కాలు

Listen "పచ్చకామెర్లపై గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల చర్చ: హెచ్చరిక సంకేతాలు, ప్రమాద కారకాలు మరియు నివారణ చిట్కాలు"

Episode Synopsis

పచ్చకామెర్లు (Jaundice) అనేది  తరచుగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇది చిన్న పిల్లల  నుండి పెద్దవారికి కూడా రావచ్చు. పచ్చకామెర్లు అంటే శరీరంలో బిలిరుబిన్ అనే పదార్థం అధికంగా పెరగడం వల్ల చర్మం, కళ్ల తెల్ల భాగం పసుపు రంగులోకి మారడం. సాధారణంగా ఇది స్వల్పంగా ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.పచ్చకామెర్ల లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా చర్మం, కళ్ల తెల్ల భాగం పసుపు రంగులోకి మారడం, మలం రంగు మారడం (పసుపు లేదా తెలుపు), మూత్రం ముదురు రంగులో ఉండడం, అలసట, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, పొట్ట నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ (PACE Hospitals Podcast) లో డా. మైసూర్ సుధీర్ గారు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ (పేస్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్), పచ్చకామెర్లకు సంబంధించి తరచుగా ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ ద్వారా మీరు పచ్చకామెర్ల హెచ్చరిక సంకేతాలు, ప్రమాద కారకాలు, నివారణ చిట్కాల గురించి పూర్తి అవగాహన పొందవచ్చు.

More episodes of the podcast PACE Hospitals Podcast